ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-01-2023 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివడం వల్ల...

Libra
మేషం :- బంధువులను కలుసుకుంటారు. మీ పథకాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. గృహంలో శుభ సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాహనం నపడుపునపుడు మెళుకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు.
 
వృషభం :- స్థిరచరాస్తుల వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. సన్నిహితులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు. ముఖ్యుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు లాభాదాయకం. 
 
మిథునం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారితో మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు.
 
కర్కాటకం :- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలమైన కాలం. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. పుణ్యకార్యాలలో ప్రముఖంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.
 
సింహం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఇంట హడావుడి తగ్గటంతో మీలో నిస్తేజం చోటుచేసుకుంటుంది. మీ దైనందిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే మీ ఆశ కార్యరూపం దాల్చగలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కన్య :- వృత్తిపరంగా ఎదురైన చికాకులు అధికమిస్తారు. ఉన్నతస్థాయి అధికారులకు తరుచు పర్యటనలు, నాయకుల నుంచి ఒత్తిడి అధికమవుతాయి. చిన్ననాటి మిత్రులతో గత అనుభవాలు ముచ్చటిస్తారు. దంపతులు మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. చేతిలో ధనం మితంగా ఉండటంతో ఆందోళన చెందుతారు.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. స్త్రీలు తమ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
వృశ్చికం :- మీ పనులు, రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమాధిక్యత తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.
 
ధనస్సు :- విజ్ఞతతో వ్యవహరించి ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. గృహంలో చిన్న చిన్న మరమ్మతులు చేపడతారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. మీ సంతానం కదలికలను గమనించటం ఎంతైనా అవసరం.
 
మకరం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. బంధు మిత్రులు మిమ్ములను ఆర్థికసాయం, హామీలు కోరే సూచనలున్నాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
 
కుంభం :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ఆప్తులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. పాత బాకీలు తీరుస్తారు. అయిన వారికి వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. షేర్ల క్రయ విక్రయాలునిరుత్సాహ పరుస్తాయి.