సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-01-2023 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా..

Taurus
మేషం :- పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఆస్తి పంపకాల విషయమై సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి.
 
వృషభం :- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. గృహ మరమ్మతులు, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వినవలసి వస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది.
 
మిథునం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. క్రయ విక్రయాలు లాభదాయకం. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు లేర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం :- కుటుంబబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి అధికంగాఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. పన్నులు, వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.
 
సింహం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలించవు. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల గురించి శుభవార్తలు వింటారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుటుంది.
 
కన్య :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. శాస్త్ర, సాంకేతిక, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఒకానొక విషయంలో మిత్రుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు.
 
తుల :- పారిశ్రామికవేత్తలు కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల గురించి ఒక అవగాహనకు వస్తారు. గత కొంతకాలంగా చికాకు పరుస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి.
 
వృశ్చికం :- వృత్తుల వారికి నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు, అరియర్స్, అడ్వాన్సులు మంజూరు కాగలవు. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను విజయ వంతంగా పూర్తిచేస్తారు.
 
ధనస్సు :- మీరెదురు చూస్తున్న పత్రాలు, రశీదులు చేతికందుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత అంతగా ఉండదు. రుణయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.
 
మకరం :- స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల నుంచి ఆసక్తికరమైన విషయాలు అందుతాయి. అసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఖర్చులు పెద్దగా ఉండవు. రుణాలు, ఇతర చెల్లింపులు వాయిదా పడతాయి.
 
కుంభం :- ఉపాధ్యాయులు ఒత్తిడి, మానసిక ఆందోళనలకు గురవుతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. సభలు, సమావేశాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. నిరుద్యోగులకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. విద్యార్థులు కళ, క్రీడ, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సఖ్యత నెలకొంటుంది.