సోమవారం, 7 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-01-2023 సోమవారం దినఫలాలు - సూర్యుని స్తుతించి, ఆరాధించిన శుభం...

Aries
మేషం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు చురుకుగా పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. గృహంలోను, సంఘంలోను అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్ ఫలితాల నిస్తుంది. అకాలభోజనం వల్ల స్త్రీలకు ఆరోగ్యము మందగిస్తుంది. 
 
మిథునం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. రుణాలు, వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఆత్మీయుల కలయిక సంతోష పరుస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. పందేలు, బెట్టింగులు, జూదాలలో పాల్గొనటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారంఉంది.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికిఆందోళన తప్పదు. కొంత ఆలస్యంగానైనా తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులు ఉండవు. 
 
సింహం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయటం క్షేమదాయకం. పత్రికా సంస్థలలోని వారికి పనిభారం అధికం. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు. కుటింబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కన్య :- చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. పాతమిత్రుల కలయికతో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- ఉద్యోగస్తులు తోటివారి ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. కాంట్రాక్టర్లకు చేతిలో పని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడతారు. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఆస్తి పంపకాల విషయమై సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం.
 
వృశ్చికం :- స్త్రీలకు మనస్థిమితం ఉండదు. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులు తోటివారి వల్ల ఇబ్బందులెదుర్కుంటారు.
 
ధనస్సు :- ధనసహాయం, హామీలు ఉండే విషయంలో దూరంగా ఉండటం మంచిది. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మకరం :- ఆర్థిక రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. విలువైన కానుకలు అందుకుంటారు.
 
కుంభం :- అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
మీనం :- ఫైనాన్స్ సంస్థలతో ఇబ్బందులెదురవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. మిమ్మల్ని పొగిడే వారే కానీసహకరించే వారుండరు. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది.