సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-12-22 గురువారం మీ రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించిన సంకల్ప సిద్ధి...

astrolgy
మేషం :- స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. పెద్దలు, ప్రముఖులతో మితంగా సంభాషించండి. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది.
 
వృషభం :- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వ్యవహారాలు మీ మాట ప్రకారమే సాగుతాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మిథునం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు సామాన్యం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు మీ శక్తిసామర్ధ్యాలను గుర్తిస్తారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంటుంది. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి.
 
సింహం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్లు ఆటంకా లెదురవుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు.
 
కన్య :- వస్త్ర, ఆల్కహాలు, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రేమ వ్యవహరాల్లో మెళుకువ చాలా అవసరం. రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది.
 
తుల :- వ్యాపార విస్తరణ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి ఇచ్చిన సలహా తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
వృశ్చికం :- ముందుగానే ధనం సర్దుబాటు చేసుకోవటానికి యత్నించండి. స్థల వివాదాలు, ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. పెద్దల ఆరోగ్యములో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు.
 
ధనస్సు :- పత్రిక, ఎలక్ట్రానికి మీడియా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ధనవ్యయంలో మితం పాటించండి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు.
 
మకరం :- విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రిప్రజెంటటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
కుంభం :- వృత్తి, ఉద్యోగస్తులకు సామాన్యం. ఉన్నతస్థాయి అధికారులకు ఆకస్మిక బదిలీ, బాధ్యతల్లో మార్పులుంటాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది.
 
మీనం :- సందర్భోచితంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. మున్ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు. స్త్రీలలో అసహనం, అశాంతి చోటుచేసుకుంటాయి. కిరణా, ఫాన్సీ, మందులు, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.