సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-12-22 శనివారం మీ రాశిఫలాలు - ఈశ్వరునికి శనికి తైలాభిషేకం...

Lord shiva
మేషం :- కొబ్బరి,పండ్ల, పూలపానీయ, నిత్యవసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. స్త్రీలపై బంధువులు, పొరుగువారి ప్రభావం అధికం. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పొదుపునకు అవకాశం తక్కువ. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు ప్రజాసంబంధాలు బలపడతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. 
 
వృషభం :- ఆదాయ వ్యయాల్లో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆత్మీయులు, అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. పెద్దలు, ఆత్మీయుల శుభా కాంక్షలు తెలుపుతారు.
 
మిథునం :- ఉద్యోగస్తులు బాధ్యతలు పెరుగుతాయి. స్త్రీలు విలాసవస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. అధిక ధనవ్యయం, ముఖ్యమైన పనులతో సతమతమవుతారు. ఒక వ్యవహారం సానుకూలతకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. అనుక్షణం ఒత్తిడి, హడావుడికి లోనవుతారు.
 
కర్కాటకం :- సహోద్యోగుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. శుభకార్యాల్లో బంధువుల ఆదరణ సంతోషం కలిగిస్తుంది. మతిమరుపుతో ఇబ్బందులు, చికాకులు ఎదుర్కుంటారు. వృత్తిపరంగా పురోభివృద్ధి సాధిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు లాభిస్తాయి. చెల్లింపులు, హామీలు, చెక్కుల జారీలో మెలకువ వహించండి.
 
సింహం :- వ్యాపారాల విస్తరణ, నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు మీరు చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ఆకగస్మిక ప్రయాణం, ధనప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. గృహనిర్మాణ ప్లానుకు ఆమోదం లభిస్తుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి.
 
కన్య :- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు వాహన యోగం, ఆకస్మిక ప్రయాణం వంటి ఫలితాలున్నాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో చక్కని అనుభవం గడిస్తారు.
 
తుల :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో అప్రమత్తత అవసరం. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వేడుకలు, శుభకార్యాలు, వినోదాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
వృశ్చికం :- స్థిరాస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వస్త్ర, బంగారు, వెండి, ఫాన్సీ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. రాబోయే ఖర్చులకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకుంటారు. గృహవాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది.
 
ధనస్సు :- నిరుద్యోగులకు ఆశాజనకం. గృహంలో ఒక శుభకార్యం ఆడంబరంగా నిర్వహిస్తారు. ధనాదాయ వృద్ధి, వ్యవహార జయం వంటి సత్ఫలితాలున్నాయి. ఖర్చులకు సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దంపతులు మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాలపట్ల వ్యామోహం అధికమవుతాయి.
 
మకరం :- విదేశీయాన యత్నాల్లో చికాకులు, ఆటుపోట్లు తప్పవు. ట్యాక్స్లులు, ఇతర చెల్లింపుల్లో జాప్యం తగదు. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబీకుల తీరు కొంత మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి నిలదొక్కుకుంటారు. మతిమరుపుతో ఇబ్బందులు, చికాకులు ఎదుర్కుంటారు.
 
కుంభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. మీ సంతానం రేపటి మీ కార్యక్రమాలను రాతపూర్వకంగా ఉంచుకోవటం మంచిది. విద్య, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధవహిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. స్త్రీలు షాపింగ్ ను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
 
మీనం :- వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కార్యసాధనలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఖర్చులు, చెల్లింపుల్లో ఆచితూచి వ్యవహరించండి. మీ సంతానం భవిష్యత్తుకు కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి.