గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-12-22 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా..

Astrology
మేషం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఫీజులు చెల్లిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.
 
వృషభం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు.
 
మిథునం :- హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకం. పెద్దలకు కాళ్ళు, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ సంల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. స్త్రీలకు చుట్టు ప్రక్కలవారితో వివాదాలు తలెత్తుతాయి. మీ సంతానం కదలికలపై దృష్టి సారించండి.
 
కర్కాటకం :- ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
సింహం :- విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో నిరుత్సాహం తప్పదు. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు.
 
కన్య :- ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. శత్రువులు మిత్రులుగా మారిసహాయం అందిస్తారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖుల పరిచయాలతో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు వంటివి తప్పవు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృశ్చికం :- వ్యాపార విషయాలలో జాయింట్ సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులకు పని భారం అధికం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని పొందుతారు.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
మకరం :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పుచాలా అవసరం. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటారు.
 
కుంభం :- వీసా, పాస్‌పోర్టు, వ్యవహారాలు సానుకూలమవుతాయి. శ్రీమతి పోరుతో కొత్తయత్నాలు మొదలు పెడతారు. శారీరక శ్రమ, నిద్రలేమితో ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బ్యాంకుల్లోమీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి.
 
మీనం :- భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగుల లక్ష్యసాధనకు నిరంతరకృషి అవసమని గమనించండి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి.