ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఆగస్టు 2025 (18:18 IST)

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

Heart Attack
Heart Attack
క్రికెట్ ఆడుకుంటుండగా గుండెపోటుకు గురవడం.. అలాగే జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మహారాష్ట్రాలోనూ ఇలాంటి విషాద సంఘటన చోటుచేసుకుంది. పింప్రి-చించ్‌వాడ్‌లోని ఓ జిమ్ సెంటర్‌లో వ్యాయామం చేస్తూ శుక్రవారం మిలింద్ కులకర్ణి (37) అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. 
 
ఆరు నెలల క్రితం తన ఇంటికి సమీపంలోని జిమ్‌లో జాయిన్ అయిన కులకర్ణి.. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లి వ్యాయామం చేసేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా జిమ్‌కు వెళ్లిన కులకుర్ణి వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 
 
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజ్ నెట్టింట వైరల్ అవుతోంది.