మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 2 ఆగస్టు 2025 (17:10 IST)

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Udaya Bhanu steps in Tribanadhari Barbaric
Udaya Bhanu steps in Tribanadhari Barbaric
సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 
ఈ క్రమంలో తాజాగా ఓ మాస్ నంబర్‌ను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను అందరినీ ఆకట్టుకున్నారు. "ఇస్కితడి ఉస్కితడి" అంటూ సాగే ఈ పాటను రఘు రామ్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట అందులోనూ ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీకి బీ, సీ సెంటర్లు ఊగిపోయేలా ఉన్నాయి. ఇక ఇందులో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.
 
ఇప్పటి వరకు వదిలిన ‘నీ వల్లే నీ వల్లే’, అనగనగా కథలా, బార్బరిక్ థీమ్ సాంగ్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. రిలీజ్‌ కోసం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. 
 
ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను పాత్ర మరింత ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని టీం ప్రకటించనుంది.
 
తారాగణం: సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్, మేఘన  తదితరులు