1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (19:22 IST)

Pooja Hegde: రజనీకాంత్ మూవీ కూలీ నుంచి పూజా హెగ్డే ది ఎక్స్‌ప్లోజివ్ స్పెషల్ నంబర్

Pooja Hegde's explosive special number
Pooja Hegde's explosive special number
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్,  ఫస్ట్ సింగిల్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.
 
మోనికా అనే ఈ పాట ఎక్స్‌ప్లోజివ్ నెంబర్ గా అదరగొట్టింది. సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే  రెడ్ కలర్ డ్రెస్ లో, ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన మూవ్స్ తో కట్టిపడేసింది. ఆమెతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కనిపించడం ట్రాక్‌కు ఫన్ ఎనర్జీ తీసుకువచ్చింది.
 
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మరో చార్ట్‌బస్టర్‌ను కంపోజ్ చేశారు. అనిరుధ్, శుభలక్ష్మి కలసి హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ లో అసల్ కోలార్ రాప్  ఫ్రెస్ నెస్ యాడ్ చేసింది.
 
కూలీ మూవీలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి పవర్‌హౌస్  స్టార్స్ నటించారు. నిర్మాత కళానిధి మారన్ నిర్మాణంలో కూలీలో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది.  సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.
 
ఆగస్టు 14న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం హాలీడే వీకెండ్ కి పర్ఫెక్ట్ టైం. ఈ సినిమా డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.  
 
తారాగణం: రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్