గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-12-2022 బుధవారం దినఫలాలు - గణపతిని పూజించినా మీకు శుభం..

Astrology
మేషం :- సభా సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవ, సామాజిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం :- మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. తోటల రంగాల వారి ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించు కోవడం శ్రేయస్కరం.
 
మిథునం :- పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు చేర్పులకు అనుకూలం. దుబారా ఖర్చులు అధికం. శ్రీమతి సలహా పాటించడంవల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. 
 
కర్కాటకం :- స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
 
సింహం :- కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. కానుకలిచ్చే విషయంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం.
 
తుల :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోవడం మంచిదికాదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు.
 
వృశ్చికం :- బంధువుల రాకతో పనులు అసంపూర్తిగా ముగించవలసివస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మందిది. కోర్టు వ్యవహరాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. హామీలకు దూరంగా ఉండటం మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు :- రుణం కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. మీ ఏమరపాటుతనం వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మకరం :- విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఒప్పందాలు, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం.
 
కుంభం :- ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత వంటివి తప్పదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు చంచల స్వభావం విడనాడి కృషిచేసిన సఫలీకృతులవుతారు. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి.