గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-12-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...

Astrology
మేషం :- పత్రికా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదురవుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం :- రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. వ్యాపారాలు కొత్త పథకాల ద్వారా వినియోగదారుల్ని ఆకర్షిస్తారు. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం శ్రేయస్కరం. పాత రుణాలు తీర్చగలుగుతారు.
 
మిథునం :- ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. శ్రమాధిక్యత, మానసి కాందోళన వల్ల అనారోగ్యానికి గురయ్యే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఒక అవకాశం చేజారిపోయే అవకాశంఉంది.
 
కర్కాటకం :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన ఉండదు. వేడుకలు, దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. విదేశాలు వెళ్ళటానికి చేసే యత్నాలు వాయిదా పడతాయి.
 
సింహం :- ఆర్థిక, లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కన్య :- వాహనం వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసివస్తుంది. విందుల్లో పాల్గొంటారు. మిత్రులతో కలిసి ఓ మంచి పనికి శ్రీకారంచుడతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
తుల :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. స్త్రీలు విశ్రాంతికైచేయు యత్నాలు అంతగా ఫలించకపోవచ్చును. అనుక్షణం ఏదో ఒక సమస్యతో చికాకు పడుతుంటారు. వ్యాపారాల అభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త స్కీములు అమలు చేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడికానవస్తుంది.
 
వృశ్చికం :- ధనవ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. 
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు.
 
మకరం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రింటింగ్, క్యాటరింగ్ రంగాల వారికి నిరుత్సాహం అధికం. కొత్త పనులు చేపట్టకుండాప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కుంభం :- శకునాలు, పొరుగు వారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు అంతగా ఫలించకపోవచ్చును. ఆకస్మిక ప్రయాణాల వల్ల ఇబ్బందులనుఎదుర్కొంటారు. బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. పెద్దమొత్తం రుణాలు అనుకున్నంత తేలికగా మంజూరుకావు.
 
మీనం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొత్త వ్యక్తులవల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. దుబారా ఖర్చులుఅదుపు చేస్తారు.