సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-01-2023 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Leo
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిథునం :- నిరుద్యోగులకు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. రాజకీయనాయకులకు తరుచు పర్యటనలు, నాయకుల నుంచి ఒత్తిడి అధికం. స్త్రీల సమస్యలు తెచ్చుకోకండి. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
కర్కాటకం :- గృహంలో నూతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింపు, పురోభివృద్ధి ఉంటుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. మీ జీవితభాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది.
 
కన్య :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడతారు. బంధువుల రాకతోగృహంలో సందడి నెలకొంటుంది. మీ మాటలు ఇతరులకు చేరేవేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు.
 
తుల :- ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మీ గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగ, రుణ యత్నాలు ఫలిస్తాయి.
 
వృశ్చికం :- రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. వాహనం నడుపునపుడు మెళుకువ అసవరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు పట్టింపులకు పోకుండా సర్దుకుపోవటం మంచిది. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ దైనందిన అలవాట్లలో మార్పులు, చేర్పులు ఎంతైనా అవసరం.
 
ధనస్సు :- ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళన వంటివి తప్పదు. నిర్వహణలోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు.
 
మకరం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగ, విదేశీ యత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి.
 
కుంభం :- తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభాదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. ప్రయాణం వల్ల స్త్రీలు స్వల్ప అస్వస్తతకు లోనవుతారు.
 
మీనం :- దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేయడంమంచిది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ స్వభావం వల్ల ఇబ్బందులెదుర్కుంటారు.