బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-01-2023 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం..

Virgo
మేషం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. దైవ సేవాకార్యాలు, వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. పాత బాకీలు తీరుస్తారు. మీ సంతానం వల్ల ఆనందం, ఉత్సాహం పొందుతారు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు.
 
వృషభం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు పూర్తిచేస్తారు. 
 
మిథునం :- ఉద్యోగ మార్పిడికై చేయుయత్నాలు త్వరలోనే ఫలించగలవు. ఆలయ సందర్శనాలలో మిత్రులను కలిసుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో వారికి అభివృద్ధి కానరాగలదు. ప్రయాణాల్లో సంతృప్తి కానవస్తుంది. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి.
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. వృత్తులు, క్యాటరింగ్ పనివారల ఆదాయం బాగుంటుంది. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటికి వ్యక్తం చేయకండి. రాజకీయ రంగాలలోవారికి ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. వృత్తిపరంగా ఎదురైన చికాకులు అధికమిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
కన్య :- కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఆకస్మికంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబీకులను బాధించగలదు. విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు.
 
తుల :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందినధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరే చూసుకోవటం మంచిది.
 
వృశ్చికం :- స్థిరచరాస్తుల వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది. అయిన వారికి వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ఎదుటి వారితో మితంగా సంభాషించటం మంచిది. విజ్ఞతతో వ్యవహరించి ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారు.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. రాజకీయనాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బంది లేక పోయినా సంతృప్తి ఉండజాలదు. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు. మీ పథకాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటంమంచిది.
 
మీనం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్లీడర్లకు, వైద్య రంగంలోనివారికి ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.