గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (19:45 IST)

రెండు సినిమాలు చేస్తున్నపుడు నాన్న గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు : శృతిహాసన్

Shruti Haasan
Shruti Haasan
`అభిమాని దర్శకుడు అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ వుంటుంది. చిన్నప్పటి నుండి ఒక హీరోని ఆరాధించడం వలన వారిలోని బలాలు అభిమానైన దర్శకుడికి తెలుస్తుంది. దీనికి నాన్న గారి (కమల్ హాసన్) విక్రమ్ సినిమా నిదర్శనం. లోకేష్ కనకరాజ్ నాన్న గారి అభిమాని. అది విక్రమ్ లో స్పష్టంగా కనిపించింది. బాలకృష్ణ గారితో  గోపీచంద్ గారు, చిరంజీవి గారితో బాబీ గారు పని చేస్తున్నపుడు సెట్ లో ఆ ఎనర్జీ కనిపించిది. తెరపై కూడా ప్రేక్షకులు ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తారు. ఈ రెండు సినిమాలు చేస్తున్నపుడు నాన్న గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు` అని  హీరోయిన్ శృతిహాసన్ అన్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. 'వీరసింహారెడ్డి' జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ రెండు చిత్రాలలో శ్రుతి హాసన్ కథానాయిగా నటించింది. ఈ సందర్భంగా ఆమె విశేషాలని పంచుకున్నారు. 
 
ఈ సంక్రాంతికి  డబల్ ట్రీట్ ఇస్తున్నారు కదా.. ఎలా అనిపిస్తోంది ?
నిజానికి ఇది నేను ఊహించలేదు. నా కెరీర్ లో ఇలా జరగడం రెండోసారి. ఏడేళ్ళ క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఒక సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి  ఇద్దరు లెజెండరీ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఈ విషయంలో చాలా అదృష్టంగా ఫీలౌతున్నా.
 
 రెండు సినిమాల్లో ఏ క్యారెక్టర్ బావుందో అనే  పోలికలు అభిమానుల్లో వస్తాయి కదా ? ఈ విషయంలో ఒత్తిడి ఉందా ?
పోలికలు పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే రెండు భిన్నమైన కథలు. భిన్నమైన పాత్రలు. వీరసింహా రెడ్డిలో నా పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుంది. వాల్తేరు వీరయ్యలో కంప్లీట్ డిఫరెంట్. రెండు పాత్రలు సవాల్ తో కూడుకున్నవి. వాల్తేరు వీరయ్యలో నా పాత్రని దర్శకుడు బాబీ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ విషయంలో ఆయనకి థాంక్స్ చెప్పాలి. వీరసింహారెడ్డి విషయానికి వస్తే నా పాత్రలో కామెడీ వుంటుంది.  కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఏ పాత్రకు ఆ పాత్రే ప్రత్యేకం.
 
చిరంజీవి, బాలకృష్ణ గారు చాలా మంచి డ్యాన్సర్లు.. వారితో డ్యాన్స్ చేయడం కష్టం అనిపించిందా ?
చిరంజీవి, బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. సుందరి పాట చాలా వైడ్ గా రీచ్ అయ్యింది. శ్రీదేవి చిరంజీవి పాట కూడా అద్భుతంగా వచ్చింది.
 
ఇందులో ఒక పాట చాలా వేడిలో మరో పాట విపరీతమైన చలిలో తీశారు కదా.. సవాల్ గా అనిపించిందా ?
వేడి మనకి సవాల్ కాదు. కానీ చలిని మాత్రం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆ చలికి తట్టుకోవడం ఒక కోట్ తో సరిపోదు నాలుగు కోట్స్ కావాలి. యూనిట్ అంతా నాలుగైదు లేయర్ల కోట్స్ వేసుకున్నారు. చిరంజీవి గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే ఫైనల్ గా అవుట్ పుట్ చూసేసరికి మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం.
 
సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ?
సంక్రాంతి పండుగ నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత నా జీవితంలోకి వచ్చింది.  తమిళ్ లో పొంగల్ అంటాం. అందరిలానే ఆ రోజు పూజ చేయడం, ఫ్యామిలీతో గడపటం ఇష్టం.  
 
కొత్త సినిమాల గురించి ?
ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్ గారితో  ‘సలార్’ చేస్తున్నా.