ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (17:36 IST)

మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతం

vijayasaireddy
మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం చెప్పారు. ఆదివారం రాత్రి విశాఖ వేదికగా చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడిని అవుతానని చెప్పారు. భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుగోలు చేశానని, త్వరలోనే ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పారు. 
 
దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు.
 
అలాగే, చిరంజీవి నటించిన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన"ని తెలిపారు. అలాగే, చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు.