బాలయ్య కటౌట్ ఎక్కువ మ్యూజిక్ అడుగుతుంది : ఎస్ ఎస్ థమన్
అఖండలో స్పీకర్లు పగిలిపోయాయి. ఓవర్ సీస్ లో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు వీరసింహా రెడ్డి లో కూడా స్పీకర్లు పగులుతాయి. జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలని అనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటారు. బాలయ్య గారి కటౌట్ ఎక్కువ మ్యూజిక్ అడుగుతుంది. నేనేం చేయలేను అని సంగీత దర్శకుడు థమన్ అన్నారు.
నందమూరి బాలకృష్ణ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి' జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు థమన్ వీరసింహారెడ్డి' చిత్ర విశేషాలని పంచుకున్నారు.
- వీరసింహారెడ్డి కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. వీరసింహారెడ్డి వేరే రేంజ్ లో వుంటుంది. బాలకృష్ణ గారి కల్ట్ మూవీ ఇది. బాలకృష్ణ గారిని ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఎంత అభిమానిస్తున్నారో వీరసింహారెడ్డి రిజల్ట్ చెబుతుంది.
- బాలకృష్ణ గారితో చేసిన అఖండ పెద్ద మ్యూజికల్ హిట్. వీరసింహ రెడ్డికి అఖండతో పోలిక లేదు. ఇది కల్ట్ మూవీ. ఎమోషనల్ హై, సిస్టర్ సెంటిమెంట్, బాలకృష్ణ గారి మాస్ అదిరిపోతుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ గారి అభిమానిగా చాలా గొప్పగా తీశారు. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా వచ్చింది.
- ఇందులో బాలకృష్ణ గారు ద్విపాత్రభినయం చేశారు. ఇద్దరూ చాలా అద్భుతంగా వున్నారు. దర్శకుడు పాత్రలు చాలా బాగా డిజైన్ చేశాడు. దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలను. ఒక సినిమాకి భేస్ మెంట్ దర్శకుడే. గోపి అద్భుతంగా తీయడం వలనే మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం వచ్చింది.
- సంక్రాంతి సినిమాల్లో పోటి వుంటుంది. పోటి ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. ఆరోగ్యకరమైన పోటి మంచి విషయమే కదండీ. అన్ని సినిమాలు గొప్పగా ఆడాలి. అందరూ బావుండాలి. తెలుగు సినిమా ఇప్పుడు మంచి స్థితిలో వుంది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను.
- జైబాలయ్య పాట గురించి బాలయ్య గారిని చూడటానికి లక్షమంది జనం వస్తారు. అక్కడ నాకు పాట కావాలని దర్శకుడు సందర్భం చెప్పారు. ఆ పాటకు కరెక్ట్ బీజీయం తో మొదలుపెట్టడానికి దాదాపు ఒక డెబ్బై మంది సింగర్స్ ఈ పాట కోరస్ గా పాడించాం.
- వీరసింహా రెడ్డి లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్.... బాలకృష్ణ గారి లక్స్, స్టయిల్ అదిరిపోతాయి. ప్రేక్షకులు ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటారో దర్శకుడు గోపి అంత అద్భుతంగా ప్రజంట్ చేశారు. చాలా రోజుల తర్వాత సెకండ్ హాఫ్ లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది. పాప్ కార్న్ తినే సమయం కూడా వుండదు. సినిమాని చూస్తూనే వుంటారు.
కొత్త సినిమాల గురించి....
రామ్ చరణ్ గారి సినిమా ఆల్బమ్ పుర్తయింది. మహేష్ బాబు గారి సినిమా వర్క్ జరుగుతోంది.