ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (19:09 IST)

ఎన్ టి. ఆర్., బాలకృష్ణ సినిమాలు చూసే నాకు వీరసింహారెడ్డి లో అవకాశం దైవ నిర్ణయం : దునియా విజయ్

Duniya Vijay
Duniya Vijay
వీరసింహారెడ్డి చిత్రంలో విలన్ గా ఆఫర్ వచ్చింది. గోపిచంద్ గారిని కలవాలి. కానీ అనుకోకుండా పనివల్ల లేటుగా వెళ్లాను. ఫస్ట్ టైం ఇలా జరిగింది. అందుకు ఆయన పోసిటీవ్ గా తీసుకున్నారు.  నన్నే ఎందుకు ఎంచుకుంటున్నారని దర్శకుడిని అడిగా. నా గత సినిమాలు చూసి, నా వర్క్ ని చూశారు. ఈ పాత్రకు నేను అయితే సరిపోతానని ఆయనకి అనిపించింది. ఇది లక్, గుడ్ టైం. అని ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ తెలిపారు. ఈ నేపధ్యంలో 'వీరసింహారెడ్డి' గురించి చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. 
 
మీ నేపథ్యం ఏమిటి?
మాది బిలో మధ్య తరగతి కుటుంబం. నాన్న వ్యవసాయం. ఫిలిం బాక్గ్రౌండ్ లేదు. చిన్నపుడు మా నాన్న, అమ్మ ఎన్ టి. ఆర్. సినిమా దానవీర సూర కర్ణ చూసి. నటన అంటేఅది అని చెప్పారు. అందులో `పాంచాలి..  అనే డైలాగ్ బాగా చెప్పేవాడిని. కన్నడ సినిమాలు బాగా చేసేవాడిని. అలా నాలో సినిమా రంగంలోకి రావాలని అనిపించింది. 
 
'వీరసింహారెడ్డి'తో మీ ప్రయాణం ఎలా మొదలైయింది?
దర్శకుడు గోపీచంద్ గారు ఇందులో నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. 'వీరసింహారెడ్డి' కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.
 
 ఇందులో మీ లుక్ ఎలా వుంటుంది ?
చాలా మొరటుగా వుంటుంది. స్క్రీన్ పై చాలా మార్పు కనిపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ముస‌లిమ‌డుగు ప్రతాప్ రెడ్డి.
 
బాలకృష్ణ గారితో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?
బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటింది ఆయనతో కలసినటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్నునేను నమ్మలేకపోయాను.
 
బాలకృష్ణ గారి సినిమాల్లో ఫైట్స్ పవర్ ఫుల్ గా వుంటాయి. మరి వీరసింహా రెడ్డి లో ఎంత పవర్ ఫుల్ గా వుంటాయి?
చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వేరే ఎనర్జీ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలౌతారు. ఇందులో బాలకృష్ణ గారితో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా వుంటుంది. అలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి. బాలకృష్ణ గారిని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది.
 
వీరసింహా రెడ్డి సక్సెస్ తర్వాత.. విలన్ గా పాత్రలని కొనసాగిస్తారా ?
మంచి పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని వుంటుంది.
 
మీరు దర్శకుడు కూడా కదా.. నటనలో దర్శకత్వ నైపుణ్యత ఎంతవరకూ ఉపయోగపడుతుంది ?
నటన, దర్శకత్వం  రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా ద్రుష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది.
 
మీకు తెలుగులో ఇష్టమైన హీరోలు ?
ఒకరని చెప్పలేను. అందరూ ఇష్టమే. ఎవరి ప్రత్యేకతలు వారికి వున్నాయి.
 
కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
'భీమా' అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది.  తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. పాత్ర బలంగా వుంటే తప్పకుండా చేస్తాను.