కిటికీల నుంచి వచ్చే ఎండ వేడిని 85% తగ్గించే ఇంధన సామర్థ్య గ్లాస్ సొల్యూషన్ విడుదల చేసిన క్లైమెట్ టెక్ కంపెనీ ఎస్ వరల్డ్
సింగపూర్ కేంద్రంగా కలిగిన ఎస్ వరల్డ్ క్లైమెట్ టెక్ పీటీఈ లిమిటెడ్, ప్రపంచంలో మొట్టమొదటి ఎనర్జీ ఎఫీషియెన్సీ గ్లాస్ సొల్యూషన్‌ను కిటిటీల కోసం విడుదల చేసింది. వాతావరణ సాంకేతికత రంగంలో ఎస్‌వరల్డ్ పనిచేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని రక్షించాలన్నది సంస్ధ లక్ష్యం. గ్లోబల్ వార్మింగ్‌ను అడ్డుకోవడానికి తగిన చర్యలను తీసుకోకపోతే 2040 నాటికి భూమి మీద నివాసముండటం కష్టసాధ్యంగా మారే పరిస్థితులు తలెత్తవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎస్ వరల్డ్ ఈ సమస్య తీవ్రతను గుర్తించి తగిన పరిష్కారాలను కనుగొనడానికి చేసిన పరిశోధనల ఫలితం ఈ విండో. ఈ విప్లవాత్మక ఉత్పత్తితో సూర్యుడి నుంచి వచ్చే ఎండ వేడిమిని 85% వరకూ ఇళ్లలో తగ్గించవచ్చు.
ఎస్ వరల్డ్ సీఈఓ మరియు సేవ్ ఎర్త్ ఉద్యమకారుడు డాక్టర్ సందీప్ చౌదరి మాట్లాడుతూ ఎస్ వరల్డ్ విడుదల చేసిన ఈ విండో సొల్యూషన్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది సోలార్ హీట్‌ను 85% వరకూ అడ్డుకోవడం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన యువీ కిరణాలను 92% వరకూ అడ్డుకుంటాయి. విద్యుత్ పొదుపు పరంగా 50% వరకూ ఆదా చేయగలవు అని అన్నారు.
డాక్టర్ చౌదరి మాట్లాడుతూ పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం 75% ఎండ వేడి కిటికీల ద్వారానే వస్తుంది. ఈ కారణం చేతనే ఎస్ వరల్డ్ ఇన్నోవేషన్ టీమ్ సస్టెయినబల్ విండోస్ పరిష్కారంపై దృష్టి సారించింది. మొదట దశలో ఈ కంపెనీ గల్ఫ్ దేశాలలో తమ సేవలను అందించనుంది. రాబోయే మూడు సంవత్సరాలలో 50కు పైగా దేశాలలో తమ కిటికీలను అందించనుందన్నారు.