మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (17:21 IST)

ఆటో ఎక్స్ పో 2023లో ‘ప్రేరేపిత భవిష్యత్తు' ప్రదర్శనను ఇవ్వనున్న కియా ఇండియా

Kia EV6
భారతదేశంలో అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారు, కియా ఇండియా, రాబోయే ఆటో ఎక్స్‌పో 2023లో ప్రయాణం భవిష్యత్తును చూపించడానికి సిద్ధంగా ఉంది. ఆటోమొబైల్‌లో నవ్యతను ప్రతిబింబించడానికి అభివృద్ధి చేయబడిన మరియు రూపొందించబడిన బ్రాండ్ తమ కాన్సెప్ట్ ఈవీని ప్రదర్శిస్తుంది. కియా కాన్సెప్ట్‌తో పాటు, దేశంలో తమ ఆర్‌వీ నాయకత్వాన్ని మరింత శక్తివంతం చేయడానికి ద్వివార్షిక ఆటోమోటివ్ ఆర్భాటంలో ప్రత్యేకమైన ప్రయాణ పరిష్కారాలను మరియు పెద్ద ఆర్ వీ- కేఏ4ను కూడా విడుదల చేస్తుంది. పెవిలియన్ లో ప్రత్యేకమైన విభాగం ద్వారా సందర్శకులు కియా ఇండియా వారి గొప్ప ప్రయాణాన్ని చూడవచ్చు.
 
3150 చదరపు మీటర్లలో విస్తరించిన, హాల్ నంబర్ 7లోని కియా పెవిలియన్ కియా ఈవీ8 సిములేటర్ జోన్, టెక్నాలజీ జోన్ వంటి ప్రేక్షకులను నిమగ్నం చేసే కార్యకలాపాలు ద్వారా సందర్శకులు మైమరచిపోయే అనుభవాన్ని అందిస్తుంది. ఇవి కియా కనక్ట్, కియా విజయాలు యొక్క మైలురాళ్లని చూపించే కేఐఎన్ వాల్ ఆఫ్ ఫేమ్, స్మార్ట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ను ప్రదర్శిస్తాయి.
 
ఈ పురోగతి గురించి మాట్లాడుతూ, శ్రీ టే జిన్ పార్క్, ఎండీ అండ్ సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, "యువ కారు తయారీదారుగా, మా పోషకులకు విలక్షణమైన అనుభవాన్నిఇవ్వడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాం. 4 సంవత్సరాలుగా, ఎంతోమందికి మేము ప్రేరణగా నిలిచాం. ఆటో ఎక్స్‌పో 2023 కూడా అటువంటిదే. మా విభిన్నమైన ప్రోడక్ట్ ప్రదర్శన ద్వారా, సుస్థిరమైన భవిష్యత్తును మేము మా సందర్శకులు చూపిస్తాం. భవిష్యత్తుపై మేము దృష్టి సారించి వాస్తవికమైన ఆలోచనలతో స్థిరంగా నిలబడ్డాం. మా వాహనాలతో, మా అన్ని టచ్ పాయింట్స్ లో కస్టమర్ అనుభవాన్ని పెంచడానికి మేము ఏ విధంగా లక్ష్యాన్ని కలిగి ఉన్నామో ప్రదర్శిస్తాము. ఇప్పటి వరకు మేము భారతదేశంలో అందుకున్న ప్రేమ, మద్దతులు అసాధారణమైనవి మరియు రాబోయే ఆటో ఎక్స్ పోలో ప్రేక్షకులు నుండి సానుకూలమైన, శక్తివంతమైన ప్రతిస్పందనను అందుకుంటామని మేము ఆశిస్తున్నాము."