ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (20:11 IST)

4 లక్షలు దేశీయ విక్రయాలు, 1 లక్ష ఎగుమతులు సహా 5 లక్షల పంపిణీలు దాటిన కియా ఇండియా

కియా ఇండియా, దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారు తమ అనంతపురం ప్లాంట్ నుండి  దేశీయ, ఎగుమతి మార్కెట్ సహా 5 లక్షల డిస్పాచెస్ (పంపిణీలు) పూర్తయినట్లుగా నేడు ప్రకటించింది. దీనితో, కంపెనీ దేశంలో 4 లక్షల సేల్స్ మైలురాయిని కూడా అధిగమించింది. 2019, సెప్టెంబర్ నెలలో సెల్టోస్‌ని షిప్పింగ్ చేయడం ఆరంభించిన నాటి నుండి  91కి పైగా దేశాలలో 1 లక్షకి పైగా కార్లని ఇప్పటికే ఎగుమతి చేసింది. కియా ఇండియా 2021లో 25%కి పైగా మార్కెట్ వాటాతో దేశంలోనే నంబర్ 1 యూవీ ఎగుమతిదారుగా కూడా మారింది.

 
టే-జిన్ పార్క్, మేనేజింగ్ డైరక్టర్- సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, “అర్థ మిలియన్ అనేది ఒక  పెద్ద సంఖ్య. ఈ మైలురాయిని మేము 2.5 సంవత్సరాలు లోపే సాధించినందుకు గర్విస్తున్నాము. భారతదేశంలో మేము ప్రారంభించిన నాటి నుండి మా నవీన ఉత్పత్తులు, సేవలతో మా కస్టమర్లకు గొప్ప విలువని కేటాయించడంపై మేము దృష్టి సారించాము. నేడు, కియా 4 లక్షల భారతీయ కుటుంబాలలో ఒక భాగం. మా గౌరవనీయులైన కస్టమర్లు మాపై చూపించిన అభిమానానికి మేము ఎన్నో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇప్పుడు, కారెన్స్ ఇప్పటికే ఆరంభమవడంతో, మేము మా తదుపరి మైలురాయిని చాలా వేగంగా సాధించే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాము, దేశంలో మా అభివృద్ధి గమనాన్ని తెలియచేసే కొత్త ప్రామాణాలు సృష్టిస్తాము.”

 
కియా ఇండియా ఇటీవల తమ నాలుగవ ఉత్పత్తి కియా కారెన్స్‌ని భారతదేశపు మార్కెట్ కోసం ఆరంభించింది. ద కియ కారెన్స్ మూడు వరుసల విశ్రాంత వాహనం ప్రపంచం కోసం భారతదేశంలో తయారైన ఉత్పత్తి. ఇది ఒక కుటుంబం మూవర్ యొక్క ఆధునికతని, ఎస్‌యూవీ యొక్క ఉత్సాహాన్ని ఒక ఆకర్షణీయమైన ప్యాకేజీలో కలిపింది. 15 ఫిబ్రవరి 22న ప్రారంభమైన కారెన్స్ ఇప్పటికే భారతదేశపు కస్టమర్లు నుండి అనూహ్యమైన ప్రతిస్పందనని అందుకుంది.