బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (21:33 IST)

దండుపాళ్యం సినిమా చూసి అచ్చం అలాగే హత్య చేసానన్న నేరస్థుడు

దండుపాళ్యం సినిమా చూసి రెచ్చిపోయి దారుణ హత్యకు పాల్పడ్డ నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలోని కదిరిలో గతేడాది నవంబర్‌ 11న ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. ఈ కేసులో దాదాపు 5 వేల మందిని విచారించిన పోలీసులు చివరకు కదిరికి చెందిన షఫీవుల్లా హత్యకు పాల్పడ్డాడని తేల్చింది.

 
దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఈ నేరానికి పాల్పడ్డాడని, ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ సూపరింటెండెంట్ ఫకీరప్ప తెలిపారు. నిందితుల నుంచి 58 తులాల బంగారం, రూ. 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 
నేరస్థుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలను వెతకడానికి ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు లక్షకు పైగా ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించామని, 5000 మంది అనుమానితులను విచారించామని ఆయన వెల్లడించారు.