బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (12:30 IST)

రాయలసీమలో అమ్మాయిల కరువు.. 1000 మంది అబ్బాయిలకు 902 మంది..?

రాయలసీమలో అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా వుంది. 
 
వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
2021 జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ బర్త్‌ రేషియో పరిశీలిస్తే ఈ విషయం వెల్లడి అయ్యింది. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా చివరిస్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 
 
దాదాపుగా 100 మంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నారు. కర్నూల్‌ జిల్లాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 908 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. 
 
ఇంచుమించు ఇది కూడా అనంతపురం పరిస్థితే. చిత్తూరు జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 924 మంది అమ్మాయిలు ఉన్నారు. అలగే కడప జిల్లాలో ప్రతి 1000 మందికి 925 మంది అమ్మాయిలు ఉన్నారు.
 
ఇందుకు కారణం అమ్మాయిలంటే చిన్నచూపు చూడటమే. కాలం మారినా మనుషుల ప్రవర్తనలో మార్పు లేదు. ఈ కారణంతోనే ఏపీలోని రాయలసీమలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. 
 
ఆడపిల్లలంటే బలవంతంగా అబార్షన్లు చేస్తున్నారు. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. 
 
రాష్ట్ర స్థాయిలో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు.