శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (17:08 IST)

కృతిశెట్టి షాకింగ్ నిర్ణయం.. అందుకే వరుసగా ఆఫర్లు?

ఉప్పెన సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కృతి శెట్టి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి కెరీర్ ఉందని కూడా చాలామంది అగ్ర దర్శకులు నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
 
నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవి నటించినప్పటికీ కృతి శెట్టి కూడా చాలా హైలెట్ గా నిలిచింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఫస్టాఫ్ లోనే రొమాంటిక్ సీన్స్ తోనే డామినేట్ చేసింది. నాని తో చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లో నటించడంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఒక విధంగా రొమాంటిక్ సీన్స్ చేయడానికి కూడా ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పకనే చెప్పేసింది.
 
పద్దెనిమిదేళ్ల వయసులో కృతి శెట్టి తీసుకుంటున్న నిర్ణయంతో అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 
 
ప్రస్తుతం బంగార్రాజు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలు కూడా మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కుతున్నాయి