బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:51 IST)

మహిళా కానిస్టేబుల్స్ యూనిఫార్మ్ కొలతలను తీసిన మగటైలర్..

వాళ్లంతా మహిళా కానిస్టేబుల్స్. ఉన్నతాధికారులు యూనిఫాం కుట్టిస్తున్నారు. యూనిఫాంకు కొలతలు కావాలి. మామూలుగా అయితే లేడీ కానిస్టేబుల్స్‌కు మహిళా టైలర్ వచ్చి కొలతలు తీయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా ఒక పోలీసు ఉన్నతాధికారి చేసిన తప్పు కారణంగా మగ టైలర్ కొలతలు తీశారు.

 
ఎక్కడెక్కడో చేతులు పెడుతూ కొలతలు తీశాడు. ఇదంతా ఎక్కడో కాదు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలోనే జరిగింది. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయారు పోలీసు ఉన్నతాధికారులు. మహిళా పోలీసులను ఘోరంగా అవమానించారు.

 
యూనిఫాం కుట్టించేందుకు మగ టైలర్‌ను తీసుకురావడం.. సుమారు 40 మందికి పైగా మహిళా కానిస్టేబుళ్ళకు మగ టైలర్ కొలతలు తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ ఫోటోలను తీసి వాట్సాప్‌లో షేర్ చేశారు. ఇది కాస్త తీవ్ర దుమారాన్ని రేపుతోంది.