శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (19:44 IST)

నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయ్?

నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయని ఏపీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వారినైనా విచారించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చామని తెలిపారు. దిశ యాప్‌ను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
 
గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్ పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 
 
నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదలే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో నేరాలు జరగడం లేదని తాము చెప్పడం లేదని, నేరస్తుల విషయంలో తమ సర్కారు ఉపేక్షించేది లేదని సుచరిత తెలిపారు.