సంబంధిత వార్తలు
- అనంతిక సనీల్‌కుమార్ 8 వసంతాలు విడుదలకు సిద్ధమవుతోంది
- Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్
- Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్ సిద్ధం
- Ram Charan: శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ చిత్రం పెద్ది ఫస్ట్ షాట్
- Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన
8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్
Ananthika Sunilkumar
టీజర్ విజువల్ గా కవితాత్మక సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వర్షంలో తడిసిన అనంతిక, ఊటీకి వచ్చిన కొత్త తెలుగు రచయిత సంజయ్‌ను గమనిస్తుంది. “అతను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వుల్లా వుంటాయి. అదే కసితో రాస్తే పిన్ తీసిన గ్రెనేడ్ లా ఉంటాయి'అనే వాయిస్ సంజయ్ పాత్రని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
"అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడు కంటే.. కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడు అంటేనే ఇష్టం" అనే డైలాగ్ యూనివర్సల్ గా కనెక్ట్ అవుతోంది. "ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం" అనే హార్ట్ టచ్చింగ్ లైన్ తో టీజర్ ముగుస్తుంది. ఇది సినిమా ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది.
విజువల్ గా, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా వుంది. విశ్వనాథ్ రెడ్డి అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే స్కోర్‌తో ఫణీంద్ర నర్సెట్టి అద్భుతమైన సంభాషణలు ప్రాణం పోసుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్.
అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైన్ సినిమా లీనమయ్యే అనుభూతిని పంచాయి. శశాంక్ మాలి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అనంతిక సనిల్‌కుమార్ అద్భుతంగా కనిపించారు. తన పెర్ఫార్మెన్స్ హార్ట్ టచ్చింగ్ గా వుంది.
అద్భుతమైన కథనంతో, 8 వసంతాలు ఈ మాన్సూన్ లో పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
తర్వాతి కథనం
