సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (15:08 IST)

లోకేశ్‌కు టైమ్ దగ్గరపడింది : విజయసాయి రెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌శ్‌కు సమయం దగ్గర పడిందంటూ వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ ఎమ్మెల్సీ పదవీకాలం త్వరలోనే ముగుస్తుందని, అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించనంత ఈజీగా నోరు పారేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. "లోకేశ్ బరితెగింపు చూస్తుంటే... MLC పదవీకాలం గడువు దగ్గర పడుతోంది. తర్వాత ఏ పదవి దక్కేది లేదు. అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడు. అమరావతి పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక, అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడు పప్పు" అంటూ ఆరోపించారు.