సంబంధిత వార్తలు
- ఏపీ ఎన్జీవోలు సమ్మెకు సై... ప్రభుత్వానికి నోటీసు జారీ
- ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడి దెబ్బకు నష్టాల్లో స్టాక్ మార్కెట్
- బ్యాంకు ఖాతా బ్లాక్ చేసినట్టు ఎస్.బి.ఐ నుంచి మెసేజ్ వచ్చిందా...?
- ముంబైలో దొంగల బీభత్సం - ఎస్బీఐ ఉద్యోగిని కాల్చి దోపిడీ
- బైక్ యాక్సిడెంట్ కేసు : సాయిధరమ్ స్పందించడం లేదు.. త్వరలో చార్జిషీట్
ఇది వివక్ష.. చట్ట విరుద్ధం - ఎస్బీఐకు జాతీయ మహిళా కమిషన్ నోటీసు
మూడు నెలల గర్భంతో ఉన్న మహిళను ఉద్యోగంలో చేరకుండా ఆపినందుకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) అధికారుల పట్ల జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఊరుకోని మహిళా కమిషన్ ఎస్బీఐకు నోటీసు జారీచేసింది. ఎస్.బి.ఐ అధికారులు ఈ మహిళను తాత్కాలిక ఫిట్ అని పేర్కొందని కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీచేసిందని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బ్యాంకు చర్య వివక్షాపూరితమైనదని, చట్టవిరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది చట్ట ప్రకారం అందించే ప్రసూతి ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. వారిని తాత్కాలికంగా అన్‌ఫిట్ అని పేర్కొంది. ఇది వివక్ష. చట్ట విరుద్ధం. ఈ మహిళ వ్యతిరేక పాలన ఉపరించుకోవాలని కోరుతూ ఎస్బీఐకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అని చెప్పారు. కాగా, గత నెల 31వ తేదీన ఎస్బీఐ జారీచేసిన సర్క్యులర్‌లో మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను పనిలో చేరకుండా నిలిపివేసింది.
