ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడి దెబ్బకు నష్టాల్లో స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. బుధవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ భారీగా పతనమైంది. ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన షేర్ల అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి.
బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60098 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 174 పాయింట్ల మేరకు కోల్పోయి 17938 వద్ద ఆగింది. ఈ ట్రేడింగ్‌లో ఎస్బీఐ, టాటా స్ట్రీల్, మారుతి సుజికి, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను అర్జించగా, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.