గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (09:34 IST)

ముంబైలో దొంగల బీభత్సం - ఎస్బీఐ ఉద్యోగిని కాల్చి దోపిడీ

ముంబై మహానగరంలోని దహిసర్ వెస్ట్‌లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకీలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులను బెదిరించి నగదును దోచుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బ్యాంకులోని వారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో ఆ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడుు. అంతేకాకుండా, మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగును కూడా దోచుకున్నారు. 
 
ఈ దోపిడీ గురించి పోలీసులకు సమాచారం అందించడంతో హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దోపిడీ దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.