శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (19:23 IST)

ఆస్ట్రేలియన్‌ ఓపెన్ సింగిల్స్ విజేతగా ఆష్లీ బార్టీ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఆష్లీ బార్టీ సొంతం చేసుకుంది.  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుపొందడం ఆమెకు ఇదే తొలిసారి. మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లావర్‌ ఎరీనాలో జరిగిన ఫైనల్స్‌లో డేనియల్‌ కాల్సిన్‌పై బార్టీ గెలుపును నమోదు చేసుకుంది. ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించి టైటిల్ విజేతగా నిలిచింది. 
 
తొలి సెట్‌లో 6-3తో విజయాన్ని నమోదు చేసుకోగా.. రెండవ సెట్‌లో ముందు కాస్త కొంత తడబడింది. 1-5తో వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత పుంజుకుని కాలిన్స్‌పై 7-6 స్కోర్‌తో విజయాన్ని తనవైపుకు తిప్పుకుంది. ఫలితంగా తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.