గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (14:52 IST)

వీరసింహారెడ్డి ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ : దర్శకుడు బి.గోపాల్

VeeraSimhaReddy
వీరసింహారెడ్డి ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ. అద్భుతంగా వుంది అని సీనియర్ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. బాలయ్య బాబు అంటే నాకు చాలా ఇష్టం. బాలయ్య బాబు అద్భుతమైన నటుడు. నాకు నాలుగు సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టారు బాలయ్య. లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయడు.. అన్నీ సూపర్ హిట్లే.  వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు లక్స్, గెటప్ చూస్తుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది. పండగకి వీరసింహారెడ్డి పెద్ద అలంకారం. సమరసింహా రెడ్డి, నరసింహనాయడు, అఖండలకి మించి వీరసింహారెడ్డి విజయం సాధించాలి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య బాబుని అద్భుతంగా చూపించాడు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ గొప్పగా నిర్మించారు. ఇందులో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నటసింహం వీర సింహమై గర్జిస్తే ఎలా వుంటుందో వీరసింహారెడ్డి సినిమా అలా వుంటుంది. ప్రపంచంలోని బాలకృష్ణ అభిమానాలంతా మీసం తిప్పి కాలర్ ఎగరేసుకునేలా వుంటుంది. ఇందులో అనుమానం లేదు. వీరసింహారెడ్డి ఫుల్ ప్యాకేజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ వుంటాయి. బాలయ్య బాబు అభిమానులు పండగ చేసుకునేలా వుంటుంది. వీరసింహారెడ్డి లో నేను ఒక భాగం అని చెప్పుకోవడం గర్వంగా వుంది. 
 
కమల్ హాసన్ గారిలో వుండే కామెడీ టైమింగ్ శ్రుతి హాసన్ గారిలో వుంది. వీరసింహారెడ్డి‌లో ప్రేక్షకులు అది ఎంజాయ్ చేస్తారు. ఎన్టీఆర్ రామారావు గారి డీఎన్ఎ కమల్ హసన్ గారి డీఎన్ఎ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎంత అద్భుతంగా వుంటుందో వీరసింహారెడ్డిలో చూస్తారు. గోపీచంద్ మలినేని ఈ సినిమా కి మాటలు రాసే అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మైత్రీ మూవీ మేరక్స్ అద్భుతమైన నిర్మాతలు. వారికి సినిమా అంటే ఒక బంధం. వీరసింహా రెడ్డి సంచలన విజయ సృష్టించింది. ఇందులో అనుమానం లేదు’’ అన్నారు.
 
హనీ రోజ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలు చేయాలని నా కోరిక. ఆ కోరిక వీరసింహా రెడ్డితో తీరింది. ఈ గొప్ప అవకాశం కల్పించిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. బాలకృష్ణ గారితో కలసి నటించడం నా అదృష్టం. మా నిర్మాతలకు, మిగతా టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు
 
దునియా విజయ్ మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి వీరసింహుడు శాంతి స్వరూపంగా ఉగ్రరూపంగా థియేటర్స్ కి వస్తున్నాడు. మీకు శాంతి కావాలంటే శాంతిగా ఉంటాడు ఉగ్రం కావాలంటే ఉగ్రరూపం చూపిస్తాడు. వీరసింహారెడ్డి ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మీ అందరిలానే నేను థియేటర్ లో చూడాలని ఎదురుచూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ తెలిపారు.