1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Secunderabad man posts wifes private photos after suspicion

భార్యపై అనుమానం - అత్యంత నిచానికి దిగజారిన భర్త

photo share
భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త... ఆమె న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భార్య అసభ్యకర ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
సికింద్రాబాద్‌కు చెందిన భీంరాజ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి మూడు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన భీంరాజ్.. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంగా రోజూ ఆమెను వేధింపులకు గురిచేయసాగాడు. 
 
భార్యకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసి అసభ్యకరంగా కామెంట్స్ చేయసాగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పుట్టింటికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫినాయిల్ సేవించి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. భీంరాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
తర్వాతి కథనం
ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...