గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (11:48 IST)

విజయ్‌ వారసుడు రిలీజ్‌ తేదీ మార్చేసిన దిల్‌రాజు

varasudu latest date
varasudu latest date
దిల్‌రాజు మొదటినుంచి భిన్నమైన వ్యక్తి. సినిమా వ్యాపారరంగంలో మెళుకువుల బాగా పట్టేశాడు. నైజాంలో ఎటువంటి సినిమా విడుదల అయినా ముందుగా దిల్‌రాజు ఆశీస్సులు తీసుకునే విడుదల చేస్తుంటారు. నైజాం మొత్తంలో ఎక్కువ థియేటర్లు ఆయన చేతిలోనే వున్నాయి. అయితే వారసుడు సినిమాను బాలకృష్ణ వీరసింహారెడ్డి విడుదల రోజే అనగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. విజయ్‌, బాలకృష్న సినిమాలు ఒకేరోజు విడుదలకావడం విశేషం. మొన్న శ్రీకాంత్‌ కూడా వారసుడు గురించి మాట్లాడుతూ, జనవరి 12న థియేటర్‌లో కలుద్దాం. విజయ్‌కు నేను బాబాయ్‌గా నటించాను అని చెప్పారు.
 
కట్‌ చేస్తే, శుక్రవారంనాడు దిల్‌రాజు తన వారసుడు సినిమాను ఒకరోజు ముందుకు జరిపినట్లు దిల్‌రాజు ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియాలో జనవరి 11న వరల్డ్‌ వైజ్‌ రిలీజ్‌ అంటూ పోస్టర్‌తో తెలియజేశాడు. రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.