శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (23:51 IST)

ప్లేయర్స్ అయినా ఒక్కడిని మాత్రమే చూస్తారు : వారసుడు ట్రైలర్ లో విజయ్

Vijay, Rashmika
Vijay, Rashmika
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
వారసుడు నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'వారసుడు' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వారసుడు' థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ''ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా'' అని జయసుధ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్  ఆద్యంతం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనుభూతిని ఇచ్చింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో పండక్కి విందు భోజనం లాంటి సినిమా వారసుడు అనే నమ్మకానన్ని ఇచ్చింది ట్రైలర్.
 
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో నిష్ణాతుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా 'వారసుడు'ని రూపొందించారు. అద్భుతమైన రైటింగ్, తన స్టైలిష్, ఫెర్పెక్ట్ టేకింగ్‌తో కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచారు వంశీ పైడిపల్లి. విజయ్‌ని గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేశారు.
 
''పవర్ సీట్లో వుండదు సర్.. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో వుంటుంది. మన పవర్ ఆ రకం'' .
 
''గ్రౌండ్ లో ఎంతమంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా.. ఆట నాయకుడిని''
 
''ప్రేమో, భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం అలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా దానికి ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తాను'' లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ట్రైలర్ లో అద్భుతంగా పేలాయి.
 
ట్రైలర్ కు ఎస్ థమన్ ఎక్స్ టార్డినరీ నేపధ్య సంగీతం అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, డ్యాన్స్ నెంబర్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్రతి మూడ్ ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. కార్తీక్ పళని కెమరాపని తనం మరో అదనపు ఆకర్షణ. విజువల్స్ అన్నీ రిచ్ గా వున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. సినిమాని అత్యున్నతంగా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. మొత్తానికి ట్రైలర్ తో వారసుడు పై అంచనాలు మరింత భారీగా పెరిగాయి.