శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (19:38 IST)

విజయ్ క్యారీవాన్ వాడరు, వారసుడు పండగలా వుంటుంది: శ్రీకాంత్

srikanth-vijay
srikanth-vijay
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో 'వారసుడు' చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
 విజయ్ 'వారసుడు' సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైయింది ?
నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి వారసుడు కథ చెప్పారు. ఇందులో విజయ్ కి బ్రదర్ గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది. 'వారసుడు' అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ వుంటాయి. సినిమా ఒక దృశ్యకావ్యంలా వుంటుంది. విజువల్స్ అద్భుతంగా వుంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే వుంటుంది. రష్మిక, జయసుధ గారు , నేను, కిక్ శ్యామ్ , శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే వుండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ వున్న సినిమాలానే వుంటుంది.
 
 ఇందులో మీది పాజిటివ్ క్యారెక్టరా ? నెగిటివ్ నా ?
 బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో వుంటాయి.  బ్రదర్స్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, అన్నీ చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ లా వుంటుంది.  వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్ కి అద్భుతమైన క్రేజ్ వుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వారసుడిని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. విజయ్ లాంటి స్టార్ హీరో తో ఒక మంచి సినిమాతో తమిళంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా వుంది.
 
 విజయ్ గారిలో ఎలాంటి ప్రత్యేకతలు గమనించారు ?
ఇంత కుముందు కొన్ని వేడుకల్లో కలిశాను. కలిసి పని చేయడం ఇదే తొలిసారి.  విజయ్ చాలా సైలెంట్ గా వుంటారు. ఎక్కువగా మాట్లాడరు.  క్యారీవాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర వుండదు.  ఒకసారి సెట్ లో అడు గు పెడితే ప్యాకప్ చెప్పినంతవరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు.
 
'వారసుడు' సంక్రాంతి కి వచ్చే సినిమాలకి పోటి అంటున్నారు ?
ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియాలా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ హిట్లు కొడుతున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పండగకి పండగ లాంటి సినిమా.
 
డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పని చేయడం ఎలా అనిపించింది
 వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఫిలిం మేకింగ్ లో చాలా పెర్ఫెక్షన్ వుంటుంది. ఎక్కడా రాజీపడకుండా తీస్తారు.
 
 తమన్ మ్యూజిక్ ఎలా ఉంది?
 ఇప్పటికే రంజితమే, అమ్మ పాట, శింబు పాడిన పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రిరికార్డింగ్ అద్భుతంగా చేశాడు.
 
 నిర్మాత దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారి. అలాగే శంకర్ గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను.
 
అఖండ లో విలన్ గా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ రోల్ చేస్తున్నారు ?
అఖండ తర్వాత డిఫరెంట్ గా వుండాలని ఈ పాత్ర చేశాను. అలాగే శంకర్, రామ్ చరణ్ సినిమా చేస్తున్నాను. అందులో మరో డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనే ఆలోచన వుంది. కథ, క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను.