బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:06 IST)

సుకుమార్ నా లైఫ్ మార్చేశారు : అల్లు అర్జున్

Anupama, arjun, nikil
Anupama, arjun, nikil
జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
 
Anupama, arjun, nikil, allu aravind, vasu and others
Anupama, arjun, nikil, allu aravind, vasu and others
అనంతరం  అల్లు అర్జున్ మాట్లాడుతూ,  నిఖిల్ ఫ్యాన్స్ కి అనుపమ ఫ్యాన్స్ కి అలానే నా ఆర్మీకి థాంక్యూ. నా ఫెవరెట్ పీపుల్ ఈ సినిమా చేస్తున్నారు. నేనెప్పుడూ అనుకుంటాను, సుకుమార్ లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు థాంక్యూ సో మచ్ డార్లింగ్. 
నా క్లోజ్ పర్సన్ వాసు, వాసు నాకు ఎంత క్లోజ్  అంటే వాసు పేరు లో కూడా నా పేరు ఉంటుంది. మా నాన్నగారు నా సొంత ఓటిటి ఛానల్ ఉన్న ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చెయ్యాలి సపోర్ట్ చేస్తున్న సినిమా మీద లవ్ ప్రొడ్యూసర్ కి రెస్పెక్ట్. గోపి గారు మ్యూజిక్ చాలా బాగుంది, మనం త్వరలో కలిసి పనిచెయ్యాలనుకుంటున్నా,ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అల్ ది బెస్ట్. ప్రతాప్ ను ఆర్య సినిమా నుంచి చూస్తున్న ఇస్తే మంచి సినిమానే ఇవ్వాలి అని వెయిట్ చేసి మరి సినిమా చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కార్తికేయ తో హిట్ కొట్టిన నిఖిల్ కి కంగ్రాట్స్. నిఖిల్ మంచి కాన్సప్ట్ సినిమాలు చేస్తాడు. అలానే నిఖిల్ చాలా పుస్తకాలు చదువుతాడు అది ఒక యాక్టర్ కి ఉండాల్సిన మంచి క్వాలిటీ. ఈ సినిమా మూడేళ్లు తరువాత రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్ కి టచ్ అవుతుంది. ఈ సినిమాను ఖచ్చితంగా చూడండి. అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి థాంక్యూ సో మచ్.
 
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ... ప్రతి సినిమా నాకు 5% నేర్పిస్తే ఈ సినిమా 25% నేర్పించింది. నిఖిల్ గారు చాలా థాంక్యూ ఎప్పుడు షూటింగ్ అన్న వచ్చేసేవారు, అలానే అనుపమ గారు కూడా. సుక్కు నా లైఫ్ లోకి ఎప్పుడు వచ్చిన మంచిగా డబ్బులు వస్తాయి. నాకు ఇద్దరు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. నా లైఫ్ లో బన్ని 100% అయితే సుకుమార్ గారు 75% దిల్ రాజు గారు 25% ఇవన్నీ కలిపితే మా అరవింద్ గారు. గోపి సుందర్ తన మ్యూజిక్ తో మేజిక్ చేస్తాడు. బన్ని గారు గురించి ఏమి మాట్లాడిన తక్కువే అవుతుంది ఆయన లేకుండా నా ఫంక్షన్ జరగదని అన్నారు. 
 
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ,  నాకు ఇది సర్రియల్ మూమెంట్, నాకు ఆర్య సినిమా చాలా ఇష్టం. సో ఇక్కడ సుకుమార్, బన్నీ ఆర్య లో ఒక పార్ట్ అయినా సూర్యప్రతాప్ గారిది ఇక్కడ కూర్చోవడం నేను ఊహించలేదు.  సుకుమార్ గారు నందిని కేరక్టర్ ను నాకు రాసినందుకు థాంక్యూ.  ఈ సినిమా డిసెంబర్ 23 న రిలీజ్ అవుతుంది. 
 
మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. సుకుమార్ గారు ఒక గొప్ప ఆలోచన మీకు వచ్చి ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో తియ్యాలి అని మీకు అనిపించి మా బన్నివాసు తో ఈ సినిమా తీసినందుకు సభాముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. 
 
హీరో నిఖిల్ మాట్లాడుతూ, నా కార్తికేయ 2 ను కూడా ప్రోమోట్ చేసి మంచి సక్సెస్ చేసారు. రాజమౌళి గారు, సుకుమార్ గారు వేసిన రోడ్ లో మా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళాం. నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2020 లో మా నాన్నగారిని కోల్పోయాను, అక్కడికి అల్లు అరవింద్ గారు వచ్చారు.  ఆయన ఒక ఫాదర్ ఫిగర్ ఆయన చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. బన్ని వాసు గారికి థాంక్యూ. సూర్యప్రతాప్ గారు ఒక చిన్న పాపల ఈ సినిమాను దాచారు. సుకుమార్ తీసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన రాసిన పాత్రలో కనిపించడం నా అదృష్టం అన్నారు. 
 
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, నేను హ్యాపీడేస్ సినిమా అప్పుడు నిఖిల్ ను పిలిచి 1 ల్యాక్ అడ్వాన్స్ ఇచ్చాను. నాకు అప్పుడే సక్సెస్ అవుతాడు అని అర్ధమైంది. నా జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిలో నాకు బన్నీవాసు తోడుగా ఉన్నాడు. తమ్ముడు ప్రతాప్ నా ప్రతికథలోని భాగమే. నేను ఒక చిన్న లైన్ చెబితే మొత్తం వాడే రాసుకుని నాకు క్రెడిట్ ఇస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం ప్రతాప్. పాటల రచయిత శ్రీమణి ను నేను పరిచయం చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతుంటాను అన్నారు. 
 
దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ, నా కుమారి 21ఎఫ్ సినిమాను వచ్చి బ్లెస్ చేసారు. ఇప్పుడు మా  18 పేజెస్ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐకాన్ స్టార్ కి థాంక్యూ సర్. ఇక్కడ లేని నా ఫ్యామిలీకి కృతజ్ఞతలు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి సుకుమార్ అన్నయ్య కారణం. సుకుమార్ గారు ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు మా టీం అందరికి సంబంధించిన వ్యక్తి. అన్నయ్య నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.