సంబంధిత వార్తలు
అనుపమ పరమేశ్వరన్ గురించి సుకుమార్ కామెంట్ ! (video)
Anupama Parameswaran, Sukumar
రంగస్థలం చిత్రాన్ని రామ్ చరణ్ తో సుకుమార్ చేసాడు. అసలు ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ చేయాల్సింది. కానీ సమంత హీరోయిన్ గా నటించింది. దానికి ఓ కారణం ఉంది. అనుపమ పరమేశ్వరన్ ఆడిషన్ కు వచ్చింది. ఆడిషన్ చేస్తూ వాళ్ళ అమ్మ వైపు చూడటం మొదలు పెట్టింది. ఒకటి, రెండు సార్లు ఒకే. కానీ పదే పదే అల్లా జరగడంతో భయమేసి సమంత ను తీసుకున్నట్లు సుకుమార్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక లో తెలిపారు. సో, ఇలా కొన్ని పాత్రలు కొందరిని చేయనివ్వక పోవడానికి చిన్న కారణాలు కూడా కారణమ్ కావచ్చు.
