శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (19:41 IST)

న్యూయర్ స్పెషల్-ఖుషి రీ-రిలీజ్.. పవన్ ఫ్యాన్స్ సంబురాలు

Kushi
Kushi
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త సంవత్సరాన్ని ఖుషీ ఖుషీగా జరుపుకునేందుకు గాను డిసెంబర్ 31న పవన్, భూమిక నటించిన ఖుషి సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారు. తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డులను చెరిపేసింది. 
 
తాజాగా ఈ సినిమా డిసెంబర్ 31న రిలీజ్ చేయడం పట్ల పవన్ పండగ చేసుకుంటున్నారు. అయితే డిసెంబర్ 31న మాత్రమే ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్, ఎస్‌జే సూర్య ఖుషీ రీ-రిలీజ్‌పై పోస్టులు చేశారు. ఒకప్పుడు ఖుషి టికెట్ల కోసం ఎంతగా పడిగాపులు చేశారో.. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.