శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (16:15 IST)

బాలయ్య షోలో పవన్ కల్యాణ్.. రేటింగ్ మామూలుగా వుండదుగా...!

pawan kalyan
డిసెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాలయ్య షోలో పాల్గొననున్నారు. బాలయ్య హోస్టుగా అన్ స్టాపబుల్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ షో రేటింగ్ కోసం పవర్ స్టార్‌ను తీసుకురావాలని ఆహా టీమ్ భావిస్తోంది. అందుకు తగనట్లుగా త్రివిక్రమ్ ద్వారా పవన్ ఈ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. 
 
తాజాగా పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆహా టీమ్‌తో పవన్ కలవనున్నారు. 
 
ఈ షోలో పవన్ బాలయ్య ప్రశ్నలకు సమాధానమిచ్చే అవకాశాలు ఎక్కువగా వుండటంతో పవన్‌ను బాలయ్య చేసే ఈ ఇంటర్వ్యూ లాంటి షోపై అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్సు వున్నట్లు తెలుస్తోంది.