బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (15:20 IST)

జనసేన వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి - నంబరు టీఎస్13 ఈఎక్స్8384

varahi vechicle
ఎన్నికల ప్రచారం కోసం జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న ప్రచార వాహనం వారాహి రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ వాహనానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబరును కూడా కేటాయించింది. ఈ వాహనానికి టీఎస్13 ఈఎక్స్ 8384 అనే రిజిస్ట్రేషన్ నంబరును కేటాయించినట్టు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పాపారావు వెల్లడించారు. 
 
వారాహి వాహనానికి రవాణా శాఖ చట్ట ప్రకారం అన్ని నిబంధనలు ఉన్నాయని, వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని ఆయన స్పష్టం చేశారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికేట్‌ను పరిశీలించామని, అవి కూడా నిబంధనలకు లోబడే ఉన్నాయని చెప్పారు. అందువల్ల వాహనం రిజిస్ట్రేషన్‌కు చట్ట ప్రకారం ఎలాంటి అభ్యంతరాలు లేనందును వారాహి వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. 
 
కాగా, వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు వచ్చిన వార్త ఏపీలోని వైకాపా నేతల్లో పచ్చివెలక్కాయపడిన చందంగా మారింది. ఈ వాహనం టీజర్‌ను రిలీజ్ చేయగానే వైకాపా నేతలు వాహనం రంగుపై నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడిన విషయం తెల్సిందే. ఇష్టమొచ్చినట్టు వాహనాలను ఉపయోగించడానికి ఇదేమి రీల్ లైఫ్ కాదనీ.. రియల్ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇపుడు వీరికి తగిన రీతిలో సమాధానం చెప్పినట్టయింది.