గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (10:25 IST)

రెండు దశాబ్దాల తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan Martial Arts Practice
Pawan Kalyan Martial Arts Practice
పవన్‌ కళ్యాణ్‌ ఫైటింగ్‌ అంటే ఇష్టం. సినిమాల్లోకి రావడానికి ముందే మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేశారు. అప్పట్లో జానీ సినిమాలో కుంగ్‌ఫూ, కరాటే తరహాలో ఫైట్స్‌ చేశాడు. ఇప్పుడు మరలా అంటే దాదాపు 20 ఏళ్ళ తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేస్తూ.. నేను రెండు దశాబ్దాల తర్వాత నా మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌లోకి వచ్చాను. అని తెలిపారు. దీనికి అభిమానులనుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొందరు జానీ సినిమాలోని స్టిల్‌ను కూడా పోస్ట్‌ చేశారు. మరికొందరు ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో. పోరాడు. సాధించు.. అంటూ పవన్‌కు బూస్టప్‌ ఇస్తూ రీట్వీట్‌ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్‌ అంతా హరిహరవీరమల్లు చిత్రం కోసమే. ఈ కథ చారిత్రాత్మక నేపథ్యంలోనిది కాబట్టి అప్పటికి అనుగుణంగా యాక్షన్‌ సీన్స్‌ చూపించబోతున్నారు.
 
కాగా, పవన్‌ కళ్యాణ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ గురించి చిత్ర దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్‌)  ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. ‘‘పవన్‌ కళ్యాణ్‌ గారు మీ మార్షల్‌ ఆర్ట్స్‌ స్కిల్స్‌ ని దగ్గరుండి హరిహర వీరమల్లు సెట్స్‌ నుంచి చూడడాన్ని చాలా అదష్టంగా భావిస్తున్నానని అలాగే ఈ చిత్రం పట్ల మీ డెడికేషన్‌ ప్రపంచం అంతా ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’’ తెలిపారు. దీనితో క్రిష్‌ కామెంట్స్‌ అభిమానులకు మరింత ఎనర్జీ ఇచ్చాయి.