గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:58 IST)

పవన్‌ కళ్యాణ్‌తో భగత్‌సింగ్‌ గురించి హరీష్‌ శంకర్‌ అప్‌డేట్‌

Pawan Kalyan, Harish Shankar
Pawan Kalyan, Harish Shankar
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా అంటే మాటలు కాదు. తను కమిట్‌ అయ్యాడంటే చేసి తీరాల్సిందే. ఒకవైపు రాజకీయాల మీటింగ్‌లో వుంటూనే మరోవైపు హరిహరవీరమల్లు సినిమాను పూర్తిచేసే పనిలో వున్నాడు పవన్‌ కళ్యాణ్‌. ఇక పవన్‌తో గబ్బర్‌ సింగ్‌ చేసిన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయాల్సివుంది. భగత్‌సింగ్‌ సినిమా పేరు. ఆనాటి భగత్‌సింగ్‌లోని ఓ అంశాన్ని స్పూర్తిగా తీసుకుని హరీశ్‌ శంకర్‌ కథ రాసుకున్నాడు. అయితే ఈ సినిమా సెట్‌పైకి వెళ్ళేందుకు కొన్ని అవాంతరాలు వచ్చాయి. అవి ఎట్టకేలకు క్లియర్‌ అయి త్వరలో సెట్‌పైకి వెళ్ళనున్నందని తెలుస్తోంది.
 
శుక్రవారంనాడు హరీష్‌ శంకర్‌, హైదరాబాద్‌ శివార్లో హరిహరవీరమల్లు షూటింగ్‌ జరుగుతుండగా వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు పవన్‌తో భేటీ అయ్యారు. అనంతరం హరీష్‌ ఈ ఆనందమైన క్షణాలను కల్పించిన హరిహరవీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్మాత ఎ.ఎం.రత్నం రిసీవింగ్‌ బాగుంది. మైత్రీ మూవీమేకర్స్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు.
 
కాగా, అనంతరం హరీష్‌ శంకర్‌ ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. అక్కడ తెలంగాణ మంత్రి అజయ్‌, హరీష్‌ శంకర్‌ నుద్దేశించి మాట్లాడుతూ, హరీష్‌ చేసిన గబ్బర్‌సింగ్‌ మా కుటుంబంతో చూశాను. చాలా బాగా తీశాడు. అప్పట్లోనే 4 నెలల్లో పూర్తిచేశాడు. ఇప్పుడు చాలామంది సంవత్సరాలపాటు సినిమాలు తీస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో ఈసారి 8 నెలల్లో భగత్‌సింగ్‌ను పూర్తిచేయాలని కోరుకుంటున్నాను అన్నారు. అనంతరం హరీష్‌ మాట్లాడుతూ, తప్పకుండా అందరి సహకారంతో మంత్రిగారు చెప్పినట్లే పూర్తిచేస్తానని ప్రకటించారు. త్వరలో దీని  గురించి ఆయన ప్రకటించనున్నారు.