గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (14:34 IST)

ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా? వైకాపాకు పవన్ ప్రశ్న

varahi vechicle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సుయాత్ర కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో ఆలివ్ గ్రీన్‌లో ఉండే ఓ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. దీనిపై ఏపీలోని అధికార వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
తొలుత తన సినిమాలను అడ్డుకున్నారని విమర్శించారు. తాను విశాఖ పర్యటనకు వెళ్లినపుడు తనను వాహనం దిగి వెళ్లిపోవాలని, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని, సినీ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని దుయ్యబట్టారు. 
 
మంగళగిరిలో తన వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా లేకుండా ఆటంకాలు కలిగించారని అన్నారు. ఇపుడు తన ప్రచార రథం వారాహి విషయంలో కూడా వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 
 
చివరకు నన్ను ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ చొక్కా అయినా వేసుకోనిస్తారా వైసీపా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆలివ్ గ్రీన్ రంగులో ఉండే ఓ చొక్కాను ఆయన షేర్ చేశారు.