1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (19:52 IST)

పవన్ ప్రచార యాత్ర రథం సిద్ధం

pawan ratham
pawan ratham
ఒకవైపు సినిమాలు, మరోవైపు జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ప్రచారానికి ఓ రథం సిద్ధం చేస్తుకున్నారు. గ్రీన్ కలర్ లో ఉండె ఈ రథం మిలట్రీ వాహానాన్ని పోలి ఉంటూ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర చేయనున్నారు. యాత్రలో భాగంగా కార్యకర్తలు, నాయకులను కలవడంతో పాటు ప్రజలని కూడా కలిసేందుకు అన్ని రకాల వసతులతో ఆయన దీనిని సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు గతంలో ఎన్ టి. ఆర్. ఈ తరహా కలర్ ని వాడేవారు. 
 
ఇక సినిమా పరంగా తన షూటింగ్స్ ముగించుకుని యాత్రకు వెళ్లనున్నారు.  ప్రస్తుతం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్నారు. దాదాపుగా చాలావరకు షూటింగ్ జరుపుకుంది.  నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.  మరోవైపు సుజీత్, హరీష్ శంకర్ లతో మూవీస్ చేయడానికి పవన్ సిద్ధమయ్యారు.