సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (14:01 IST)

ఖుషి సినిమాకు సమంత దూరమైందా? విదేశాలకు వెళ్లలేదే!

kushi
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ "ఖుషి" సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సమంత నటిస్తోంది. అయితే మయోసైటిస్ కారణంగా ఈ సినిమాకు సమంత దూరమైందని టాక్ వస్తోంది. 
 
ఈ వార్తలకు సమంత చెక్ పెట్టింది. ఖుషికి తాను దూరం కాలేదని స్పష్టం చేసింది. అంతేగాకుండా తాను విదేశాల్లో మయాసైటిస్‌కు చికిత్స తీసుకోవట్లేదని తేల్చి చెప్పేసింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. 
 
ప్రస్తుతం సమంత హైదరాబాదులో వుంది. అలాగే హిట్-2 సినిమా సక్సెస్ తర్వాత అడవిశేష్‌కి అభినందనలు కూడా తెలిపింది సమంత.