బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (07:44 IST)

విజయ్‌ దేవరకొండ సరసన కృతిశెట్టి !

Vijay Deverakonda
Vijay Deverakonda
నటుడు విజయ్‌ దేవరకొండ తాజా సినిమా ఖుషి. ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు అన్నీ జరిగాయి. ఈ సినిమాకు నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన కీలక పాత్రలో కృతిశెట్టి నటించనున్నదని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె డేట్స్‌ విజయ్‌ సినిమాకు వున్నాయి. ఇందులో ఆమె నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రలో నటించనున్నదని సమాచారం.
 
విజయ్‌ దేవరకొండ అసలు ఈ సినిమాకు ముందు జనగణమణ సినిమా చేయాల్సి వుంది. కానీ లైగర్‌ తర్వాత ఏర్పడిన ఫలితాలు ఆ సినిమాపై నీళ్ళు జల్లాయి. దాంతో ఆ సినిమా కొండెక్కింది. ఇటీవలే లైగర్‌ చిత్ర నిర్మాతంలో నెలకొన్న బడ్జెట్‌ తదితర వ్యవహాలను గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మితోపాటు విజయ్‌ దేవరకొండను కూడా అవినీతి నిరోధర శాఖ అనుమానాలతో వారిని విచారణ చేపట్టింది. కనుక ఇక ఆ సినిమా వుండదని తెలిసిపోయింది. కాగా, విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు. మరి సమంత ఆరోగ్యం బాగోక పోవడంతో సినిమా షూట్ ఆగిపోయింది. మరి లేటెస్ట్ సమామాగం తెలియాల్సిఉంది.