మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (11:07 IST)

హీరోయిన్ సమంత ఆరోగ్యం క్షీణించిందా? (video)

Samantha
అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ప్రచారం సాగుతోంది. దీనిసై సామ్ బృందం స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తమంటూ కొట్టిపడేసింది. 
 
సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. నిజానికి సమంత ఆరోగ్యం గురించి వార్త రాసేముందు ఓసారి నిర్ధారణ చేసుకోవాలని కోరింది. 
 
కాగా, సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆమె ఆరోగ్యం విషమించిందంటూ ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్ టీం ఈ వార్తపై స్పందించింది. 
 
కాగా, మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే "యశోద" సినిమాలో నటించిన సమంత తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ చిత్రం విజయం సాధించింది. పైగా, ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషీ పేరుతో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నారు.