ఆస్పత్రి పాలైన సమంత.. నిజమేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఆమె ఇటీవల మయాసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కోసం చికిత్స కూడా తీసుకున్నారు. ఆపై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే మళ్లీ సమంత ఆస్పత్రిలో చేరింది. ఎందుకంటే మయాసైటిస్ నయం అయ్యే వ్యాధి కాదు. తరచుగా చికిత్స తీసుకుంటూ వుండాలి. మందులు సమయానికి వేసుకోవాలి.
తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని.. దీంతో ఆమె చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. రెండు, మూడు రోజుల నుంచి సమంత యాక్టివ్‌గా కనిపించకపోయేసరికి ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు.
సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సమంత ఆరోగ్యం క్షీణించలేదని.. ఆమె ఆస్పత్రిలో చేరలేదని స్పష్టం చేశాడు. సమంత ఆరోగ్యంగా వుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు.