శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (15:50 IST)

సపోటాతో ఆరోగ్యం.. 48 రోజులపాటు తింటే..?

Sapota
Sapota
సపోటాలో విటమిన్ సి, ఎ, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు వున్నాయి. సపోటా పండును మెత్తగా నూరి దాని రసాన్ని తేనెలో కలిపి తాగితే కడుపు సంబంధిత రుగ్మతలు, కడుపునొప్పి నయమవుతాయి. 
 
సపోటా పండును 48 రోజులపాటు తింటే అల్సర్, పేగుల్లో మంట, కడుపునొప్పి, గుండెల్లో మంటలు నయమవుతాయి. సపోటా పండును తొక్క తీసి పాలలో కలిపి గ్రైండ్ చేసి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.
 
సపోటా పండులోని కొన్ని పోషకాలు, విటమిన్లు రక్తనాళాలను సక్రమంగా ఉంచే గుణం కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తాయి. సపోటా పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు మంచిది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
 
సపోటా పండు తిన్న తర్వాత ఒక టీస్పూన్ జీలకర్రను బాగా నమిలి మింగడం వల్ల పిత్తం తొలగిపోతుంది. పిత్తాశయ రాళ్లకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.